వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయి
అక్రమ కేసులకు భయపడేది లేదు
చంద్రబాబు క్షేమంగా ఉండాలని కోరుతూ అహోబిలం నరసింహ స్వామికి పూజలు
నూటక్కా కొబ్బరికాయలతో మ్రొక్కులు
ఆళ్లగడ్డ న్యూస్: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడంతో రాష్ట్రంలో వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని ఉమ్మడి కర్నూలు జిల్లా టిడిపిమాజీ ఉపాధ్యక్షులు గూడూరు సంజీవ రాయుడు. టిడిపి సీనియర్ నాయకులు శెట్టి వేణుగోపాల్. పత్తి వెంకటనారాయణలుఆ న్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆళ్లగడ్డ మండల పరిధిలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం క్షేత్రంలో చంద్రబాబు నాయుడు క్షేమంగా జైలు నుండి విడుదల కావాలని కాంక్షిస్తూ లక్ష్మీనరసింహస్వామి సన్నిధానంలో కొబ్బరికాయలు కొట్టి అనంతరం పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా టిడిపి నేత గూడూరు సంజీవరాయుడు మాట్లాడుతూ అక్రమ కేసులకు భయపడేది లేదని టిడిపి శ్రేణులు క్షేత్రస్థాయిలో శాంతియుతంగా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ప్రతి ఒక్కరు శాంతియుతంగా తమ నిరసనలను తెలియజేయాలని కోరారు.
రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఓటమి చెందుతుందనే కారణంతో వైసిపి కి భయం పుట్టుకుందని అందుకనే అధికారాన్ని అడ్డం పెట్టుకొని తమ నేత నారా చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు బనాయించారని వారు తెలిపారు. పోలీసులు వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా తమ ఆందోళనలను కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. అనంతరం టిడిపి కార్యకర్తలు సైకో పోవాలి అంటూ నినాదాలు చేస్తూ బాబుతో మేము తోడుగా అంటూ చంద్రబాబు నాయుడుకు సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలమూరు గ్రామం, అహోబిలం టిడిపి నాయకులు కార్యకర్తలు శెట్టి వేణుగోపాల్ పత్తి వెంకటనారాయణ రామచంద్రయ్య పేరూరు మహేశ్వర్ రెడ్డి. నీరు కట్టు గురప్ప శెట్టి నరసింహులు పత్తి కృష్ణారెడ్డి టంగుటూరి రామచంద్ర అహోబిలం రాంబాబు సాయినాథ్ వీరయ్య నాగవర్ధన్ పేరయ్య ఆలమూరు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు క్షేమంగా ఉండాలని కోరుతూ అహోబిలం నరసింహ స్వామికి పూజలు
RELATED ARTICLES