Tejanews tv
చండ్రుగొండ జూన్ 04.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండల పరిధి మద్దుకూరు గ్రామంలోని సుండ్రు విజయ్, కుటుంబం గత ఎన్నో సంవత్సరాల నుంచి తన అన్న సుబ్బారావు, నిర్మల, దంపతుల కుమారుడు కేశవ్ రోడ్డుప్రమాదం వలన చనిపోయిన దగ్గర నుంచి సుమారు 20 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు కేశవ, పేరు మీద జరుపుకుంటూ వస్తున్నారు. ఇటీవల మద్దుకూరు. గ్రామంలో జాయిస్మైల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కుంజ రామకృష్ణ, సుండ్రు విజయని సంప్రదించగా మా ఫౌండేషన్ ద్వారా సుమారు 50 మంది విద్యార్థులకు సాయంత్రం పూట ట్యూషన్ చెప్పి సాయంత్రం భోజనం సదుపాయాలు కల్పిస్తున్నాము అని చెప్పగా విశాల హృదయం గల సుండ్రు విజయ్, వెంటనే తన అన్న కుమారుడైన సుండ్రు కేశవ్ జ్ఞాపకార్ధంగా నెలకి 3000 రూపాయల చొప్పున జీవితకాలం పిల్లలకి ట్యూషన్, భోజనం నిమిత్తం అందిస్తామని తెలిపారు. అదే గ్రామానికి చెందిన నల్లమోతు నాగేశ్వరరావు, డాక్టర్. వీరా రావు, వీరి ఇరువురు కలిసి పిల్లలకి కొంత మొత్తంగా పిల్లలకు సహాయం చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడంలో మా ఫ్యామిలీ ఎంతో ముందుంటుందని సుండ్రు విజయ్ తెలిపారు. మద్దుకూరు. గ్రామంలో చదువుకుంటున్న పదవ తరగతి విద్యార్థులు మండలంలో టాపర్ గా నిలిస్తే విద్యార్థికి 5000 రూపాయలు అందిస్తామని కూడా తెలిపారు.
చండ్రుగొండ: సుండ్రు కేశవ్ జ్ఞాపకార్ధంగా ఎన్నో ఏళ్లుగా పలు సేవా కార్యక్రమాలు – విజయ్ కుటుంబం
RELATED ARTICLES