Saturday, December 13, 2025

చండ్రుగొండ: ఆల్ పార్టీ నాయకులతో ఎంపీడీవో సమావేశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
30.08.2025

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఓటర్ల ముసాయిదా జాబితాపై శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో బయ్యారపు అశోక్ ఆధ్వర్యంలో ఆల్ పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ముసాయిదా ఓటర్ లిస్ట్‌పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా వెంటనే తెలియజేయాలని ఎంపీడీవో సూచించారు. పలు పార్టీ నాయకులు మాట్లాడుతూ—కొన్ని కుటుంబాలకు చెందిన ఓట్లు వేర్వేరు వార్డుల్లో నమోదయ్యాయని, వాటిని సరిచేయాలని కోరారు.

ఎంపీడీవో అశోక్ వివరాలు తెలుపుతూ—

చండ్రుగొండ మండలంలోని 14 గ్రామపంచాయతీలలో మొత్తం 23,855 మంది ఓటర్లు ఉన్నారని,

వీరిలో పురుషులు 11,640, మహిళలు 12,214, ఇతరులు 1 అని తెలిపారు.

మండలంలోని 134 వార్డులకు 134 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయని చెప్పారు.

తుది జాబితా వచ్చే నెల 2వ తేదీన విడుదల కానుందని వెల్లడించారు.


ఆయన మాట్లాడుతూ, ఈరోజు జరిగిన సమావేశంలో వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని సవరణలు చేపడతామని అన్నారు.

ఈ సమావేశంలో మండల పంచాయతీ అధికారి మహమ్మద్ ఖాన్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస చారి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దారం గోవిందరెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ధారా వెంకటేశ్వరరావు, బిజెపి మండల అధ్యక్షుడు నల్లమోతు రఘుపతిరావు, సిపిఎం మండల కార్యదర్శి పెద్దిని వేణు, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, మాజీ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మేడా మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular