భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో వైయస్సార్ విగ్రహం వద్ద చండ్రుగొండ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు దివంగత నేత వైయస్సా రాజశేఖర్ రెడ్డి, వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదనంతరం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్, ప్యాకెట్లు, పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
చండ్రుగొండలో ఘనంగా రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు
RELATED ARTICLES