భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
చండ్రుగొండ మండలం
చండ్రుగొండలో ఘనంగా ప్రజా పరిపాలన దినోత్సవ వేడుకలు
చండ్రుగొండ, సెప్టెంబర్ 17.
ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా బుధవారం మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
తహసీల్దార్ కార్యాలయంలో బి.సంధ్యారాణి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో బయ్యారపు అశోక్, పోలీస్ స్టేషన్‌లో ఎస్సై శివరామకృష్ణ, పశువైద్యశాలలో డాక్టర్ సంతోష్, ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో సిహెచ్.ఎల్లయ్య, సిడిపిఓ కార్యాలయంలో సలోమణి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వెంకట ప్రకాష్, గ్రామపంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులు జాతీయ పతాకాలను ఎగురవేశారు.
ఈ సందర్భంగా అధికారులు ప్రజా సేవలో తమ పాత్రను మరింత బలోపేతం చేసేందుకు ప్రతిజ్ఞ చేశారు.





