Saturday, January 17, 2026

చండ్రుగొండలో గ్రంథాలయం కోసం చిన్నంశెట్టి

జిల్లా కలెక్టర్‌ను కలిసి కోరిన యూత్ కాంగ్రెస్ నాయకుడు మహేష్ – సానుకూలంగా స్పందించిన కలెక్టర్ జితేశ్ వి పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

తేజ న్యూస్ టీవీ




చండ్రుగొండ, ఆగస్టు 23.
చండ్రుగొండ మండల కేంద్రంలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్‌ను మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్నంశెట్టి మహేష్ వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ — “గ్రంథాలయం లేక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవిష్యత్ తరాల కోసం గ్రంథాలయం అత్యవసరం” అని తెలిపారు.

కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సానుకూలంగా స్పందిస్తూ — “మండల కేంద్రంలో గ్రంథాలయ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ నాయకులు కుక్కముడి లక్ష్మీనారాయణ, భూక్యా నరేష్, సయ్యద్ మజీద్, దారావత్ శివ, అనిరుద్, బడుగు గణేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular