గ్రామ ప్రజలు అందరూ కలిసి కాట్రపల్లి గ్రామంలో శ్రీ మహాలక్ష్మి పోచమ్మ గుడి, హనుమాన్ గుడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో అలాగే గవిచర్ల గ్రామంలో శ్రీ గుండా బ్రహ్మయ్య దేవాలయం, (శివాలయం) భూమి పూజ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మరియు కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి,
సంగెం మండలం కాట్రపల్లి గ్రామంలో శనివారం శ్రీ మహాలక్ష్మి పోచమ్మ గుడి, హనుమాన్ గుడి లో అభయాంజనేయ స్వామి, పోచమ్మ తల్లి విగ్రహాల ప్రతిష్టాపన చేశారు,
కాట్రపల్లి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కి గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు పూజారులు వేదమంత్రాల మధ్య ఆశీర్వచనలు అందించి పూజలు నిర్వహించారుఅనంతరం గ్రామ ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేలకు శాలువా కప్పి సత్కరించారు.ఆలయాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారలు అందిస్తానని తెలిపారు.దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయం అని అన్నారు.ఈ కార్యక్రమంలో సంగెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చోల్లేటి మాధవరెడ్డి, కందకట్ల నరహరి, పరకాల అధికార ప్రతినిధి జనగాం రమేష్, మాజీ జడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపిటిసి సంపత్,మాజీ సర్పంచ్ దోనికల శ్రీను-రమ,గవిచర్ల ఆలయ కమిటీ చైర్మన్ కోతం యాదగిరి, మండల మహిళల అధ్యక్షురాలు బిక్కిరెడ్డి సంధ్య,అచ్చ నాగరాజు, గుమ్మడి సంపత్,ముఖ్య నాయకులు, గ్రామ ప్రజలు నాయకులు పాల్గొన్నారు.
ఘనంగా పోచమ్మ తల్లి, అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట
RELATED ARTICLES