నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ఎల్లావత్తుల గ్రామంలో మంగళవారం ఘనంగా గంగమ్మ జాతర నిర్వహించారు ఈ జాతరలోకి భాగంగా ప్రతి ఇంటికి బంధువులను సైతం రప్పించి కుటుంబ సభ్యులతో పోలేరమ్మ, గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కలను తీర్చుకున్నారు దీంతోగ్రామంలో పండగ వాతావరణం నెలకొంది, రాత్రి గంగమ్మ తల్లి గ్రామోత్సవం నిర్వహించి అనంతరం గంగమ్మ తల్లిని గ్రామం మధ్యలో ఉన్నటువంటి గంగమ్మ దేవాలయంలో గంగమ్మ తల్లి విగ్రహాన్ని ఆలయంలో కొలువుతీర్చారు అనంతరం కొలువుదీరిన గంగమ్మ తల్లికి తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు వేలాది మంది భక్తులు వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో పొట్టేలు, మేకలు, కోళ్లు సైతం పోలేరమ్మ, గంగమ్మ దేవతకు సమర్పించి భక్తులు మొక్కలను తీర్చుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో ఎల్లావత్తుల గ్రామం నుంచి కాకుండా చుట్టుపక్కల గ్రామాలైన శ్రీరంగాపురం చిన్న కంబలూరు, పెద్ద కంబలూరు మరియు ఇతర మండలాల నుంచి అనేకమంది భక్తులు గంగమ్మ తల్లిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గంగమ్మ తల్లి ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిరివెళ్ల సర్కిల్ సిఐ దాస్తగిరి బాబు రుద్రవరం ఎస్సైవరప్రసాద్ ఇంకాపలువురు పోలీస్ సిబ్బంది పూర్తి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఘనంగా ఎల్లావత్తుల లో గంగమ్మ జాతర
RELATED ARTICLES