చండ్రుగొండ మండల పరిధిలోని రావికంపాడు ప్రభుత్వ పాఠశాలలో నెల రోజులుగా విద్యార్థినీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తయారు చేయటానికి వంట మనుషుల కు బిల్లులు రాకపోవడం వలన వారు వంటకు రానని మొరాయించారు. ఈ సందర్భంగా పత్రికల వార్తలకు స్పందించి గ్రామ శాఖ అధ్యక్షుడు బోగిని బోయిన కోటేశ్వరరావు, భరోసాతో వంట మనుషులను నియమించి భోజనం తయారు చేయించారు.పిల్లలు సంతోషంగా భోజనం చేయడం జరిగింది. తదనంతరం ఎంపీడీవో పాఠశాలను సందర్శించి పిల్లలకు భోజన సదుపాయం ప్రతిరోజు చేయాలని వంట మనుషులకు తెలియజేశారు.
గ్రామ శాఖ అధ్యక్షుడు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రారంభమైన మధ్యాహ్న భోజన పథకం
RELATED ARTICLES