మక్తల్ నియోజకవర్గ పరిధిలోని నర్వ మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో గురువారం రోజు మండల స్థాయి మరియు బూత్ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు.ఇట్టి కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం కావాలంటే సెప్టెంబర్ 5 నుండి మొదలు కాబోయే బిజెపి సభ్యత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామ గ్రామాన బిజెపి సభ్యత్వ నమోదు జోరుగా జరగాలని.స్థానిక సంస్థల ఎన్నికల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పార్టీకి కట్టుబడి ఉండాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటింటికి చేరే వేసే విధంగా కార్యకర్త పనిచేయాలని,పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి రాంపురం నర్సింలు,బిజెపి మండల సభ్యత్వ ఇంచార్జ్ జగన్నాథం,సభ్యులు సంజీవ్ కుమార్,జిల్లా ఉపాధ్యక్షులు రవి వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామ గ్రామాన జోరుగా బిజెపి సభ్యత్వ నమోదు
RELATED ARTICLES