డప్పు కొట్టనందుకు గ్రామ బహిష్కరణకు గురి అయిన *పంచమి నరసమ్మ (కీ”శే”శంకరయ్య) కుటుంబాన్ని మంగళవారం రోజు మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం గోతోజిగూడెం గ్రామంలో సందర్శించి వారికి దైర్యం చెప్పడం జరిగింది.
మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణ పెరుమాండ్ల ఆద్వర్యంలో రాష్ట్ర కమిటి బృందం ఆ గ్రామాన్ని సందర్శించి వారి కుటుంబం తో మాట్లాడటం జరిగింది.
అలాగే స్థానిక డిఎస్పి వెంకట్ రెడ్డి తో* పోన్ లొ మాట్లాడి పరారిలో ఉన్న నిందితులను వెంటనే పట్టుకొచ్చి అరెస్టు చేసి జైలుకు పంపాలని కోరడం జరిగింది.
గ్రామంలో వాతావరణం చక్కదిద్దేలా ప్రభుత్వ అధికార్లు స్పెషల్ పోకస్ పెట్టాలని కోరడం జరిగింది
ఈ కార్యక్రమం లో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలుకటి జనార్థన్ మాదిగ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాతరి రోజారాణి మాదిగ , MSF రాష్ట్ర అధ్యక్షులు తప్పెట్ల ప్రవీణ్ మాదిగ గారు,
సీనియర్ నాయకులు సాంబయ్య మాదిగ నల్లా నరెందర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
గ్రామంలో సమస్యలు చక్క చక్కదిద్దేలా ప్రభుత్వ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టాలి -డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ
RELATED ARTICLES