TEJA NEWS TV :తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ జ్యోతి పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి గ్రామంలో మంగళవారం లబ్ధిదారులకు గృహజ్యోతి పథకంలో జీరో బిల్లును అందజేశారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు శ్రీనివాస్, లతీఫ్ కాంగ్రెస్ నాయకులు అజయ్ రెడ్డి, రమేష్ గౌడ్, దైనిక్ సునీల్ కుమార్,సిద్దు, పోశయ్య తదితరులు పాల్గొన్నారు.