భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
Tejanews
చండ్రుగొండ ఫిబ్రవరి 2. పశుగ ణాభివృద్ధి సంస్థ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో చండ్రుగొండ మండలంలోని గుర్రాయి గూడెం గోపాల మిత్ర కేంద్ర లోఏర్పాటుచేసిన పశువైద్య శిబిరం నందు మండల పశువైద్యాధికారి డాక్టర్ LVS రాంప్రసాద్, 34 గర్భకోశ వ్యాధిగ్రస్త పశువులకు శుక్రవారం వైద్య సేవలు అందించారు. 18 లేగ దూడలకు నట్టల నివారణ మందులు అందించారు. శిబిరం ను పశుగణాభివృద్ధి సంస్థ ఖమ్మం జిల్లా కార్యనిర్వాహణాధికారి డాక్టర్ కే కిషోర్ సందర్శించారు కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన లేగ దూడల ను పరిశీలించారు .పాడి రైతులకు కృత్రిమ గర్భధారణ పై మరియు లింగ నిర్ధారిత వీర్యం ద్వారా ఆడదూడలు పుట్టుట గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర సూపర్వైజర్ బి సాయి ప్రకాష్, గోపాలమిత్రాలు యాదగిరి రాము, ఆకుల శ్రీనివాసరావు , గుర్రం వెంకట దాసు, మాలోత్ ప్రసాద్ ,నరేష్ ,సురేష్ పాల్గొన్నారు.
గుర్రాయిగూడెం గోపాలమిత్ర కేంద్రంలో పశు వైద్య శిబిరం
RELATED ARTICLES