భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వరావుపేట నియోజకవర్గం
Tejanewstv
అశ్వరావుపేట జూలై 22. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ అశ్వరావుపేట మండలం గుమ్మడపల్లి పెద్ద వాగు ప్రాజెక్టు పరిశీలించి ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు భూమి పాసు బుక్కు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఏ పంట వేసుకున్న నష్టపోయిన విత్తనాలను ఉచితముగా ఇస్తామని అలాగే ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని ప్రత్యేకంగా అదనంగా ఇండ్లు మంజూరు చేస్తామని తెలియజేశారు. మరణించిన పశువులకు నష్టపరిహారం ఇస్తామని మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
గుమ్మడపల్లి పెద్దవాగు ప్రాజెక్టు ముప్పు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
RELATED ARTICLES