TEJA NEWS TV :
శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ లో FPO కార్యాలయంలో క్షేత్ర దినోత్సవం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రైతులకు ఉన్న సందేశాల గురించి మరియు పంట సాగులో తీసుకోవలసిన మెలుకువలు, రసాయన ఎరువులు తగ్గించి సాంప్రదాయ పద్ధతిలో ప్రకృతి వనరులతో మరియు పశువుల ఎరువులను ఉపయోగించి వ్యవసాయం చేసే విధానాలను, పాడి పశువుల పెంపకo మరియు వాటి ద్వారా వచ్చు ఆదాయాలు మరియు వాతావరణ మార్పులు మరియు దానికి అనుగుణంగా వ్యవసాయ పద్ధతుల గురంచి, జీవన ఎరువుల తయారీ మరియు వాడకం గురించి రైతులకు అవగాహన కల్పించారు.అధిక దిగుబడి పొందిన రైతులు మరియు ఆదర్శ రైతుల అనుభవాలు, పంచుకొన్నారు.అలాగే APMAS క్లైమేట్ స్మార్ట్ విలేజ్ ప్రాజెక్టు తరఫున చేస్తున్న కార్యక్రమాలను మరియు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను స్టాల్ ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ K N నరసయ్య,ఏరువాక డైరెక్టర్ రామసుబ్బయ్య,డాక్టర్ హరీష్,ఏపీ మాస్ డైరెక్టర్ గోపాల్ రాజు, డిపిఎం( ఎల్ హెచ్ ) రామ్మోహన్, ,డిపిఎం ఫైనాన్స్ రామి రెడ్డి, డిపిఎం ఐబి నాగరాజు , ఏరియా కోఆర్డినేటర్ S R నాగరాజు,మండల వ్యవసాయ అధికారి వీర నరేష్, కెనరా బ్యాంక్ మేనేజర్ లోక్ నాథ్ రెడ్డి ,FPO సీసీ దేవరాజు, అనిల్ కుమార్ ,FPO సిబ్బంది, డైరెక్టర్లు ,రైతు సంఘాల సభ్యులు ఆనిమేటర్లు పాల్గొన్నారు.
గుడిబండ FPO కార్యాలయం నందు AP MAS మరియు గుడిబండ FPO ఆధ్వర్యంలో క్షేత్ర దినోత్సవం
RELATED ARTICLES