Saturday, January 17, 2026

గుడిబండ: మహిళా సంఘాల వినతి—అవినీతి యానిమేటర్‌పై చర్యలు తీసుకోండి

TEJA NEWS TV: గుడిబండ, శ్రీ సత్యసాయి జిల్లా: పి సి గిరి గ్రామంలో గతంలో మహిళా సంఘాలకు సంబంధించిన నిధులను దుర్వినియోగం చేసిన మాజీ యానిమేటర్ సురేష్‌పై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల సభ్యులు గురువారం ఉప తహసీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి మరియు ఎస్‌ఐ రాజ కుళ్ళాయప్పలకు వినతి పత్రం అందజేశారు.

సురేష్ గత రెండు సంవత్సరాల క్రితం యానిమేటర్‌గా పనిచేస్తూ దాదాపు ₹18 లక్షల రూపాయలు అవినీతికి గురిచేసి పరారయ్యాడు. ఈ విషయంపై సంబంధిత జిల్లా మరియు పోలీస్ అధికారులకు గతంలోనే ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

మహిళా సంఘాల సభ్యులు మాట్లాడుతూ, “ఇప్పటికైనా సురేష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపి మాకు న్యాయం చేయాలి” అని కోరారు.

ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షుడు ఎన్ మంజునాథ్, గ్రామైఖ్య సంఘం కార్యదర్శి చంద్రకళ, మహిళా సంఘాల సభ్యులు షాతాజబి, పుట్టమ్మ, మహాలక్ష్మి, గంగమ్మ, లక్కమ్మ, భాగ్యమ్మ, శాంతమ్మ, దేవిరమ్మ, సుజాతమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular