Monday, January 20, 2025

గుడిబండ మండలంలో జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు పర్యటన

TEJA NEWS TV

శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలంలోని కొంకల్లు మరియు గుడిబండ గ్రామాల్లో  జిల్లా వ్యవసాయ అధికారి  వైవి సుబ్బారావు మరియు మడకశిర ఏ డి ఏ కృష్ణ మీనన్  పంట పొలాలను సందర్శించారు.
రబి 2023 ఈక్రాప్ బుకింగ్ చేయించుకున్న రైతుల పొలాలను సూపర్వైజరి చెక్ లో భాగంగా వారి పంట పొలాలను తనిఖీ చేశారు .
అదేవిధంగా ఈనెల ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవడానికి చివరి తేదీ అని,ఆలోపు ఈక్రాప్ బుకింగ్ చేయించుకోని రైతులు ఎవరైనా ఉంటే రైతు భరోసా కేంద్రం అధికారులను సంప్రదించి పూర్తి చేసుకోవాల్సిందిగా మరియు ఈ కేవైసీ ని కూడా పూర్తి చేసుకోవాల్సిందిగా రైతులకు సూచించారు. అదేవిధంగా ఈ కేవైసీ ని త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా రైతు భరోసా కేంద్రం అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వీర నరేష్,కొంకల్లు రైతు భరోసా కేంద్రం అధికారి సంధ్యారాణి,మరియు రైతు లు చిన్న, పుట్ట నరసమ్మ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular