TEJA NEWS TV:
శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం కెరికెర గ్రామంలో స్థానిక కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లో ఆర్.డి.టి, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
పది తరువాత పెళ్లి కాదు పదకొండు అనే కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ఆర్ డి టి టీం లీడర్ ఆదినారాయణ అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముందుగా చిన్నారులకు లఘుచిత్రాల ద్వారా ప్రస్తుతo సమాజంలో ఎదురైయ్యే సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి ( బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు ) అనే విషయాలు తెలియజశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గుడిబండ ప్రాజెక్ట్ మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి పథక అధికారిణి పద్మావతి మాట్లాడుతూ,మాఘ మాసం మొదలవుతున్న వేళ ఆడబిడ్డలు జాగ్రత్తగా ఉండాలని బాల్య వివాహాలు జరిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలుపుతూ, చిన్న వయసులో వివాహాలు చేయడం వలన అమ్మాయిలు మానశిక, శారీరక ఒత్తిడికి గురి కావడం మరియు ప్రసవ సమయంలో తల్లి బిడ్డ ప్రాణాలు కోల్పోతారని తెలుపుతూ, ఆడ పిల్లలకు 18 సంవత్సరాలు మగ పిల్లలకు 21 సంవత్సరాలు నిండిన తరువాతే వివాహ ప్రయత్నాలు చేయడం ఉత్తమము అని తెలియజేశారు. అలా కాకుండా బాల్య వివాహం చేయాలని చూస్తే బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం బాల్య వివాహాo చేసుకున్న, నిర్వహించిన, సహకరించిన మరియు హాజరైన ప్రతి ఒక్కరూ శిక్షార్హులు ఇందుకు గాను రెండు సంవత్సరాలు జైలు శిక్ష లేదా లక్ష రూపాయలు జరిమానా లేదా రెండూ విదింప బడుతాయి అని తెలియజేస్తూ ఎక్కడైనా బాల్య వివాహాలు చేయాలని ప్రయత్నిస్తుంటే వెంటనే టోల్ ప్రీ నంబర్లు 1098, 100 మరియు 112 లకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటారని తెలియజేస్తూ ప్రభుత్వము మరియు స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా పని చేసినపుడే బాల్య వివాహ వ్యవస్థను రూపు మాపవచ్చునని వారు తెలిపినారు
ఆర్ డి టి టీం లీడర్ ఆదినారాయణ మాట్లాడుతూ సమాజంలో బాలల పట్ల వివక్షత తీవ్రరూపం దాల్చిందని బాల్య వివాహాలు,బాలలపై లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయని బాలలను మరియు వారికున్న హక్కులను ( జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు మరియు భాగస్వామ్యపు హక్కు ) కాపాడవలసిన భాద్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని తెలియజేశారు అందులో బాగాగంగా ఆర్ డి టి సంస్థ కర్ణాటక సరిహద్దు మండలాల్లో ప్రభుత్వ శాఖల సమన్వయంతో బాలల హక్కుల పరిరక్షణ కోసం ముందస్తు చర్యగా గ్రామ స్థాయిలో మరియు పాఠశాల, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని అందులో ముఖ్యంగా బాల్యవివాహాలు, లైంగిక వేధింపులు, మంచి స్పర్శ మరియు చెడు స్పర్శ వలన కలిగే అనర్థాలను లఘు చిత్రాల ద్వారా తల్లిదండ్రులకు మరియు చిన్నారులకు అర్థమైయ్యే విదంగా అవగాహన కల్పిస్తున్నామని కాబట్టి అమ్మాయిలు తల్లిదండ్రులకు నమ్మకాన్ని ఇస్తూ చదువు మీద దృష్టి పెట్టి బాగా చదువుకోవాలని అంతే కాకుండా ఉన్నత లక్ష్యాలను చేరుకోవడం కోసం మధ్యలో ఎదురైయ్యే చిన్న చిన్న ఆకర్షణలను త్యాగం చేసినపుడే గొప్పవారు అవుతారని తెలుపుతూ స్వచ్ఛంద సంస్థలు మరియు అన్ని ప్రభుత్వ శాఖలు సమిష్టిగా పని చేసి బాల్య వివాహ వ్యవస్థను రూపు మాపుదామన్నారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ లక్ష్మి, మహిళా పోలీస్ పుష్ప, ఉపాధ్యాయులు శ్యామల, భారతి,మహాదేవి,లక్ష్మి, శారద,శశికళ,రత్న, అంగన్వాడి కార్యకర్తలు మరియు చిన్నారులు పాల్గొన్నారు.
గుడిబండ: పుస్తకాలు మోసే వయసులో పుస్తెల భారం వద్దే వద్దు
RELATED ARTICLES