TEJA NEWS TV : త్రాగునీరు లేని మాచినేని పాలెం
గుక్కెడు మంచినీళ్ల కోసం మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణం
నిద్రావస్థలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు
ఎన్టీఆర్ జిల్లా
మాచినేని పాలెం
ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం మాచినేనిపాలెం గ్రామంలో సుమారుగా మూడు నెలల నుండి మంచినీళ్లు రావటం లేదు.సుమారు మూడు కిలోమీటర్ల వెళ్లి పిల్లలు, వృద్దులు,మహిళలు నీరు తెచ్చుకోవడం చాలా బాధగా ఉన్నది. ఎండాకాలం అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ వర్షాకాలంలో ఏమిటి ఇబ్బంది అని ప్రశ్నిస్తున్న గ్రామస్తులు.
మంచినీరుఎందుకు రావట్లేదని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను అడగగా మరియు కాంట్రాక్టర్ అడగగా బోర్లు నీళ్లు మంచినీళ్లు రావని సమాధానం చెబుతున్నారు.
ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ముందస్తుగా ఎందుకు చర్యలు తీసుకోలేదు.ప్రజలు ప్రాణాలతో ఆడుకుంటున్న అధికారులు
వర్షాలు పడే వరకు మంచినీళ్లు రావని సమాధానం చెబుతున్న కాంట్రాక్టర్లు మరియు అధికారులు..
అసలు ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని మచినేనిపాలెం ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు ఎంతవరకు స్పందిస్తారో చూద్దాం….