గుంటూరు జిల్లా
పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ASI నుండి హెడ్ కానిస్టేబుల్ వరకు సిబ్బందికి యెక్క స్థితిగతులు తెలుసుకొని నిష్పక్షపాతంగా బదిలీల కార్యక్రమం నిర్వహించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ **
బదిలీల కార్యక్రమం పూర్తయిన అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలోని స్పందన కాన్ఫరెన్స్ హాల్ నందు బదిలీలపై వెళ్తున్న సిబ్బందితో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…
బదిలీపై ఆయా స్టేషనులకు వెళుతున్న పోలీస్ సిబ్బంది నిబద్ధత తో బాధ్యతగా విధులు నిర్వహించాలి మీ స్టేషన్ పరిధిలో అల్లరి ముఖ ఆకతాయి పట్ల శ్రద్ధ వహించాలి
గంజా డ్రగ్స్ మత్తు పదార్థాల సమాచారం ఉన్నట్లయితే ముందుగా సంబంధిత అధికారులకు తెలియపరిచి వాటిని అరికట్టే దిశగా విధులు నిర్వహించాలి
ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది నగర ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగాకుండా సజావుగా ట్రాఫిక్ ఉండేటట్లు చూసుకోవలి
సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుల పట్ల మర్యాదగా మాట్లాడి వారి యొక్క ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులతో న్యాయం జరిగేటట్లు చూడాలి
పోలీస్ స్టేషన్లో పనిచేసే ప్రతి పోలీస్ సిబ్బంది ఇష్టంగానూ సంతోషంగాను పని చేయాలి
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపిఎస్ గారితో పాటు జిల్లా అడ్మిన్ అడిషనల్ ఎస్పీ రమణమూర్తి డిస్టిక్ పోలీస్ కార్యాలయం AO వెంకటేశ్వరరావు , ఎస్పీ గారి సిసి ఆదిశేషు , కార్యాలయం సిబ్బంది మరియు స్పెషల్ బ్రాంచ్ సిఐ ఆనంద్ , AR అడ్మిన్ ఆర్ ఐ బ్రహ్మానందం , ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు….
గుంటూరు జిల్లా లో పోలీస్ బదిలీల కార్యక్రమం నిర్వహించిన ఎస్పీ సతీష్ కుమార్
RELATED ARTICLES