ఐనవోలు మండల పరిధిలోని లింగామోరిగూడెం గ్రామంలో నిన్న గీతా కార్మికుడు తాటిచెట్టు ఎక్కి గుండెపోటు తో చెట్టు పైనే మరణించడంతో సోమవారం రోజు ఆయన భౌతిక దేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి వారి కుమారులు రాజేష్, మజ్నులను పరామర్శించి మనో దైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ప్రభుత్వం తరఫున అన్ని విధాలు ఆదుకుంటామని హామీ ఇచ్చిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు* అనంతరం తాడిచెట్టు పైన మరణించిన సత్తయ్య గౌడ్ ని ధైర్య సాహసంగా చెట్టు పైనుంచి చెట్టు పైనుంచి కిందకి తీసిన ఎం.డి గుల్పాషా ని ఎమ్మెల్యే ని సన్మానించడం జరిగింది.. ఎమ్మెల్యే వెంట వర్ధన్నపేట మాజీ జడ్పిటిసి కమ్మగొని ప్రభాకర్ గౌడ్ మరియు స్థానిక మండల అధ్యక్షుడు సమ్మెట మహేందర్ గౌడ్, మాజీ జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్ రావు, మండల మహిళా అధ్యక్షురాలు ఎలీషా, కంటెస్టెంట్ జెడ్పిటిసి పోలేపల్లి బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీటీసీ మధు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రుద్వేగ్ రెడ్డి, రాకేష్ రెడ్డి, మరియు మండల గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గీత కార్మికునికి ఘనంగా నివాళులు అర్పించిన వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే నాగరాజు
RELATED ARTICLES