భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
ఆగస్టు 31.
– గిరిజన విద్యార్థులకు పది నెలలుగా మధ్యాహ్న భోజనం పెట్టడం లేదు
గిరిజన విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం
– పట్టించుకోని మండల విద్యా అధికారులు
చండ్రుగొండ మండల పరిధిలో గల దుబ్బ తండా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయకపోవడం ఆందోళన కలిగిస్తుందని గిరిజన నాయకులు గుగులోతు శ్రీనివాసరావు, జిల్లా గిరిజన నాయకులు భూక్య కుమార్, ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు పట్ల చిన్నచూపు తగ్గదని వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించి దుబ్బ తండా, పాఠశాలలో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. చండ్రుగొండ ఎంఈఓ పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని కోరారు. లేనిపక్షంలో విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడుతామని వెల్లడించారు.
గిరిజన విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం – పట్టించుకోని మండల విద్యా అధికారులు
RELATED ARTICLES