భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
గణేష్ ఉత్సవాలలో అనుసరించవలసిన జాగ్రత్తలు
చండ్రుగొండ మండల పరిధిలోని గ్రామాలలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని గణేష్ విగ్రహాలను ప్రతిష్టించి మండపాలు ఏర్పాటు చేయదలచిన వారు ముందుగా చండ్రుగొండ పోలీసు వారి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. స్థానిక పోలీసుల అనుమతి ఆన్లైన్ దరఖాస్తులు గాని స్థానిక పోలీసులు స్టేషన్లో గాని తెలియజేయాలి అని సబ్ ఇన్స్పెక్టర్ స్వప్న తెలియజేశారు. అలాగే విగ్రహాలు ఎత్తు 5 అడుగులకు మించరాదని విగ్రహాలు ప్రజాస్థానాల్లో ప్రతిష్టించాలి అనుకునేవారు స్థానిక పంచాయతీ నుండి అనుమతి పొందాలి అని అన్నారు. రాత్రి 10 గంటల తర్వాత ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని విద్యుత్ కనెక్షన్ కోసం విద్యుత్ శాఖ నుండి అనుమతి పొందాలని ఇతర మతాల ప్రజలకు లేదా వారి ప్రజా స్థలాలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఊరేగింపు మరియు నిమజ్జనం కార్యక్రమాల్లో మద్యం సేవించడం అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని . అసభ్యకరమైన అనైతిక ప్రదర్శనలు ఆడవారి డాన్సులు నిర్వహించరాదని ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు సబ్ ఇన్స్పెక్టర్ జి స్వప్న తెలియజేశారు.
గణేష్ విగ్రహాలను ప్రతిష్టించేవారు పోలీస్ అనుమతులు తీసుకోవాలి – ఎస్ఐ జి. స్వప్న
RELATED ARTICLES