Friday, January 24, 2025

గణేష్ నిమర్జనానికి అంతా సిద్ధం

గణేష్ నిమర్జనానికి అంతా సిద్ధం.

జిల్లా వ్యాప్తంగా 1537 గణేష్ విగ్రహాల ఏర్పాటు

గోదావరి నది కరకట్ట వద్ద గణేష్ నిమర్జనం  జరిగే ప్రదేశాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్.

గణేశ్ నవరాత్రులు ముగించుకొని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భద్రాచలం వద్ద గోదావరి నదికి నిమర్జనం  కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అ సౌకర్యాలు కలగకుండా. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. నిమర్జనం జరిగే ప్రదేశాలను స్వయంగా వెళ్లిపరిశీలించారు. నిమర్జనం సమయంలో ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు వారి సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.పోలీసు వారి యొక్క సూచనలకు అనుగుణముగా నిర్వాహకులు,ఉత్సవ కమిటీ సభ్యులు నడుచుకొని ప్రశాంతముగా నిమర్జన కార్యక్రమం పూర్తయ్యేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లకు అంతా సన్నద్ధమైందని వారు అన్నారు.జిల్లాలోని అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో గణేష్ నిమర్జన ఊరేగింపు కార్యక్రమాలు  పూర్తి  చేయనున్నామని తెలిపారు.నిమర్జనం సందర్భంగా ఊరేగింపు సమయంలో డీజేలు,బాణాసంచా కాల్చడం వంటివి నిషేధమని సూచించారు.ముఖ్యంగా ఉత్సవ కమిటీ సభ్యులు బాధ్యతగా నియమ నిబంధనలను పాటిస్తూ పోలీసు వారి సూచనలను పాటించాలని కోరారు.చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.భక్తిశ్రద్ధలతో నవరాత్రులను ముగించుకొని ఆఖరున జరిగే నిమర్జనం కార్యక్రమాన్ని మత సామరస్యంతో,శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.జిల్లాలో మొత్తం 1537 విగ్రహాలతో పాటు,రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి కూడా ఎక్కువ మొత్తంలో భద్రాచలానికి నిమర్జనానికి వస్తున్న భక్తులకు ఇలాంటి అ సౌకర్యాలు కలగకుండా రద్దీగా ఉండే ప్రదేశాలలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పూర్తిగా చర్యలు చేపట్టడం జరిగిందని తెలియజేసారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular