——————————-
చేగుంట సెప్టెంబర్ 14
చేగుంట మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పద్మశాలి గణేష్ మండలి వద్ద శనివారం వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మండలి సభ్యులు సామూహికంగా వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. రైతులకు అధికంగా పంటలు సమృద్ధిగా పండాలని రైతులు సంతోషంగా ఉండాలని ఆ గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరికీ,ఎల్లప్పుడు ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో, పద్మశాలి మండలి సభ్యులు, మేకల జయరాములు, మేకల రవి మేకల చక్రపాణి, పంచాక్షరి, మేకల నాగరాజు, పుట్ట మహేష్, డిష్ రాజు,సతీష్ భూపాల్ రెడ్డి,లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
గణనాతుని ఆశీస్సులు ఎల్లపుడు ప్రజలపై ఉండాలి..పద్మశాలి మండలి ఆధ్వర్యంలో అన్నదానం
RELATED ARTICLES