TEJA NEWS TV :
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టన పంచాయతీలోని నంద్యాల రోడ్డు వీవర్స్ కాలనీలో నివాసం ఉండే దిబగుంట్ల ప్రతాప్ కు చెందిన గడ్డివాము గత శనివారం ప్రమాదవశాత్తూ అగ్నిలో దగ్ధమయ్యంది. ఈ విషయం తెలుసుకున్న శెట్టి విజయ్ కుమార్ వెంటనే స్పందించి గురువారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి మానవతా దృక్పథంతో బాధితుడికి రూ.10 వేలు చెక్కు ను ఆర్థిక సహాయంగా అందించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆపద లో ఉన్నవారికి సాయం అందించేందుకు మానవతా దృక్పథంతో ముందుకు రావాలని సూచించారు.అలాగే ఆపదలో ఉన్న వారికి కుల మతాలకు అతీతంగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని,నంద్యాల జిల్లా లోని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు నా సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాయల్ కాప్స్ రాష్ట్ర సలహాదారుడు గూడూరు సంజీవరాయుడు, రాయల్ కాప్స్ ఏపీ తెలంగాణ యువ పొలిటికల్ ప్రెసిడెంట్ అంగం శివ రాయల్, మైలారు శ్రీనివాసులు,అడ్వకెట్ యాగటీల రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.
గడ్డివాము దగ్దమైన బాధిత కుటుంబానికి 10వేలు ఆర్థిక సాయం
RELATED ARTICLES