ఖాజీపేట మండలం, కె. అగ్రహారం:
శ్రీ హజరత్ ఖాజా సయ్యద్ షా నత్తడ్ షావలి ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకుని కె. అగ్రహారం గ్రామంలో నిర్వహించిన బండలాగుడు పోటీలు ఉత్సాహంగా సాగాయి.
పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఏపీఐఐసీ మాజీ డైరెక్టర్ దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు.
కార్యక్రమంలో ఖాజీపేట ఎంపీటీసీ జంగిటి శివప్రసాద్, ఉరుసు కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సవం పురాతన సంప్రదాయాలను గుర్తు చేస్తూ, సామూహిక ఐక్యతకు వేదికగా నిలిచింది.



