ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలోని **క్వారీలు, క్రషర్ల వల్ల తాము పండించిన పంటలు నాశనమవుతున్నాయని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం** చేశారు. శుక్రవారం రైతులు పెద్ద సంఖ్యలో క్వారీల వద్దకు చేరుకొని **నిరసన కార్యక్రమం** చేపట్టారు.
రైతులు పేర్కొన్న వివరాల ప్రకారం, “క్వారీల నుండి వస్తున్న **దుమ్ము ధూళి కారణంగా పంటలు పూర్తిగా పాడైపోతున్నాయి**. పంటల దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. శ్రమించి వేసిన పంటలు పండక **లక్షల్లో నష్టపోతున్నాం**” అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వారు ఆరోపించిన ప్రకారం, **క్వారీ యజమానులు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా, ఇష్టారాజ్యంగా తవ్వకాలు, క్రషింగ్ పనులు నిర్వహిస్తున్నారు**. పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోకుండా మట్టి, రాళ్ళు మరియు ధూళితో పరిసర గ్రామాల్లోని పొలాలు తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయని పేర్కొన్నారు.
రైతులు సంబంధిత అధికారుల నుంచి స్పందన లభించకపోతే, ఉద్యమాన్ని మరింత విస్తృతపరిచే అవకాశం ఉందని హెచ్చరించారు. పర్యావరణ శాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీ అధికారులు తక్షణమే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు..
క్వారీ, క్రషర్ దుమ్ముతో పంటలు నష్టపోతున్నాయని పరిటాల రైతుల ఆందోళన
RELATED ARTICLES