Saturday, January 17, 2026

క్రమశిక్షణ, గెలుపోటములను సమానంగా స్వీకరించే తత్వం క్రీడల్లో దాగి ఉంది – ఎమ్మెల్యే జారె

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

తేజ న్యూస్ టీవీ


21.08.2025, గురువారం

దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం క్రీడామైదానంలో దమ్మపేట మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల స్థాయి ఫోటోగ్రాఫర్ల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌ను గౌరవ అతిథిగా విచ్చేసిన అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ  ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “క్రీడలు యువతలో క్రమశిక్షణను పెంపొందించడమే కాకుండా గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించే తత్వాన్ని అలవర్చుతాయి. ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి” అన్నారు.

అలాగే ఫోటోగ్రాఫర్ల వృత్తి సేవలు సమాజానికి ఎంతో విలువైనవని, వారి ఐక్యతతో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే జారె ప్రశంసించారు.

కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, ఫోటోగ్రాఫర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular