తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
రిటైర్డ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎర్ర విజయ్ కుమార్.
సంగెం మండల కేంద్రంలో ‘మార్గం స్వచ్చంద సేవా సొసైటీ’ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు వేసవి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రొఫెసర్ విజయ్ కుమార్ హాజరయ్యారు.
విద్యార్థులు చదువుతోపాటు ఏకాగ్రతను క్రమశిక్షణను పెంపొందించుకుంటే ఉద్ధమ ఫలితాలు సాధిస్తారని రిటైర్డ్ డిగ్రీ ప్రిన్సిపాల్ ఎర్ర విజయ్ కుమార్ సూచించారు సోమవారం సంగెం మండల కేంద్రంలోని మార్గం స్వచ్ఛంద సేవా సొసైటీ ఆధ్వర్యంలో వచ్చే విద్యా సంవత్సరానికి ముందస్తుగా పదవ తరగతి 2024-2025 ఆధ్వర్యంలో మార్గం సంస్థ కార్యదర్శి సింగారపు బాబు అధ్యక్షతన పదవ తరగతి ప్రత్యేక ఉచిత వేసవి శిక్షణ శిబిరం ప్రారంభించి, ప్రారంభ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన రిటైర్డ్ ప్రొఫెసర్ ఎర్ర విజయ్ కుమార్.మాట్లాడుతూ చెడు వ్యసనాలకు విద్యార్థిని విద్యార్థులు దూరంగా ఉండాలని,ప్రణాళిక, ఏకాగ్రత, ఉత్తమ క్రమశిక్షణతోనే, నిరాశ, నిస్పృహ, లోను కాకుండా ప్రణాళిక ప్రకారం చదివి విజయం సాధించాలన్నారు ఒత్తిడికి గురికాకుండా పరీక్షల్లో అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించి గురువులు, తల్లిదండ్రులకు, పుట్టిన గ్రామం, చదువుతున్న పాఠశాలకు, మంచి పేరు తీసుకురావాలని సూచించారు.మీ ఉన్నత చదువులకి ఉచిత విద్యకు ఇది చక్కని అవకాశం. పేద విద్యార్థుల విద్యాసంకల్పానికి మార్గం స్వచ్ఛంద సేవ సొసైటీ తోడుగా ఉంటుంది. భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా మారడానికి పునాది,విద్యాభివృద్ధికి తోడ్పడండి మార్గం సంస్థ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్గం సంస్థ అధ్యక్షులు బొజ్జ సురేశ్ , అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మంకాల యాదగిరి, ఉపాధ్యాయులు సిలువేరు శ్రీనివాసులు ఆలపించిన విద్య గీతాలు విద్యార్థిని విద్యార్థులను ఉత్తేజపరిచాయి. కరుణ శ్రీ, కిషన్ కుమార్, చిర్ర రాజ్ కుమార్, మొగిలి, చిర్ర ప్రశాంత్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
క్రమశిక్షణతోనే ఉత్తమ ఫలితాలు..ప్రతి ఒక్కరికీ చదువే ఆయుధం
RELATED ARTICLES