TEJA NEWS TV : అవగాహన రాహిత్యంతో చిన్నారులకు అందవలసిన సంపూర్ణ పోషణ పాల ప్యాకెట్ లు కాస్త ముళ్ళ పొదల పాలయిన ఘటన కర్నూల్ జిల్లా కోసిగి మండలంలో చోటుచేసుకుంది.ఇక వివరాల్లోకెళితే అంగన్వాడి కార్యకర్తలు గత కొన్ని రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జీతాలు పెంచాలంటూ ధర్నా చేసిన విషయం తెలిసిందే అయితే ఈ సమయంలో అంగన్వాడి కార్యకర్తలు ఎవరు విధులకు పోకుండా అంగన్వాడీలకు మూత పడటంతో ప్రభుత్వం చిన్నారుల బాధ్యతను సచివాలయాలకు అప్పగించడం జరిగింది. సచివాలయ సిబ్బంది అంగన్వాడీలను తెరచి చిన్నారులకు, గర్భిణీలకు ప్రభుత్వం నుంచి అందవలసిన పోషణ ఆహార సదుపాయం చూసుకోవాలని ఆదేశిస్తే సరైన అవగాహన లేని కోసిగి 2వ సచివాలయం సిబ్బంది చిన్నారులకు ఇవ్వవలసిన సంపూర్ణ పోషణ పాల ప్యాకెట్లను టైం ఎక్స్పైర్ అయిందని, పాల ప్యాకెట్లు లీకైనాయని కారణాలతో వందల పాల ప్యాకెట్లను ముళ్లపదల్లో పారవేశారు. పాల ప్యాకెట్లు తయారీ తేదీ డిసెంబర్ 2023 అని ఉండటంతో అధి కాస్త ఎక్స్పైర్ డేట్ అని భావించిన సిబ్బంది వాటిని పారవేశారు అయితే ఆ పక్కలోనే వ్రాసి ఉన్న ప్యాకింగ్ చేసిన రోజు నుంచి 90 రోజుల వరకు నిల్వ ఉంచవచ్చు అని రాసి ఉన్నది మాత్రం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉంది
కోసిగి : ముళ్ళ పొదల పాలయిన సంపూర్ణ పోషణ పాల ప్యాకెట్ లు
RELATED ARTICLES