TEJA NEWS TV
కర్నూల్ జిల్లా కోసిగి నివాసి అయిన మాజీ zptc మంగమ్మపై హత్యాయత్నం జరిగింది. మంగమ్మ తన నివాసం లో ఉన్న సమయంలో కోసిగి గ్రామానికి చెందిన కురువ మల్లయ్య అనే వ్యక్తి మంగమ్మపై కత్తితో దాడి చేసి హత్యయత్నం చేశారు. స్థానికుల నుంచి తెలిసిన వివరాల మేరకు మాజీ జెడ్పిటిసి మంగమ్మ, కురువ మల్లయ్యతో గతంలో సహజీవనం చేశారని, కొంతకాలంగా వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో తరచు గొడవపడి, తిరిగి కలిసే వారని,కానీ నిన్న జరిగిన వాదోపవాదాల మధ్య ఆవేశానికి గురైన కురువ మల్లయ్య తనవెంట తెలుసుకున్న కత్తితో మంగమ్మ పక్కలో గొడవగా పక్కనున్న మంగమ్మ మనవడు నెత్తుటి మడుగులో ఉన్న మాజీ జెడ్పిటిసి మంగమ్మను స్థానికుల సహాయంతో హుటాహుటిన కోసిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆదోనిలోని మధు ఆసుపత్రిలో చేర్పించినట్టు స్థానికులు తెలిపారు. మాజీ జెడ్పిటిసి అయిన మంగమ్మ పై హత్యాయత్నం జరగడంతో ఒక్కసారిగా కోసిగి మండలం ఉలిక్కిపడింది. నిందితుడు కురువ మల్లయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
కోసిగి : మాజీ ZPTC పై హత్యాయత్నం
RELATED ARTICLES