TEJA NEWS TV:
విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్షిప్ అందించేలా జీవో లను విడుదల చేయాలి- ఏఐఎస్ఎఫ్ నాయకుల డిమాండ్
అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం కోసిగి తహసిల్దార్ ఆఫీస్ లో ఆర్ఐ తిక్కస్వామికి గారికి వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మంత్రాలయం తాలూకా అధ్యక్షుడు ఎస్.ఈరేష్ మండల కార్యదర్శి అంజి మాట్లాడుతూ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాలు, మండలాలు కరువు కాటకాలతో ప్రజలు విద్యార్ధులు తల్లితండ్రులు నాన అవస్థలు పడుతున్నారు వారు జీవన ఆధారం కోసం ముట ముళ్ళు సద్దుకొని తల్లిదండ్రులు విద్యార్థుల ఫీజులు కట్టలేక విద్యార్ధులను పాఠశాలలకు,కళాశాలకు, పంపిచాల్సిన తల్లిదండ్రులు విద్యార్థులను గుంటూరు, బెంగళూర్,వలసలకు తీసుకెళ్ళిపోతున్నారు అన్నారు, భారత కమ్యూనిస్టు పార్టీ సీపిఐ ప్రజా సంఘాలు ఆందోళనలకు ధర్నాలకు రాష్ట ప్రభుత్వం రెండు రోజుల క్రితం కర్నూలు జిల్లా లో కరువు కాటకాలతో అల్లాడిపోతున్న మండలాలను గుర్తించి కరువు మండలాలుగా ప్రకటించారు అందుకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ గా హర్షిస్తున్నాం అన్నారు అలాగే కరువు మండలంలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు అన్ని రకాల ఫీజులను రద్దు చేసి వెనుకబడిన ప్రాంతాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్ షిప్ విడుదల చేసి విద్యార్థులకు అన్ని రకాల ఫీజుల రద్దు చేసే జీవోలను జారీ చేయాలని అధికారులు కోరారు, వెంటనే కరువు మండలాలలో కరువు సహాయక చర్యలు చేపట్టి ప్రజలను రైతులను, విద్యార్థి తల్లితండ్రులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు నరసింహులు, రాజు, తదితరులు పాల్గొన్నారు. K5tv repoter khadar basha, kosigi.