TEJA NEWS TV : సిపిఐ జిల్లా సమితి పిలుపుమేరకు మండల సిపిఐ కార్యదర్శి గోపాల్ అధ్యక్షతన కర్నూల్ జిల్లా c.p.i కార్యదర్శి బి గిడ్డయ్య ఆధ్వర్యంలో కోసిగి మండలంలోని సిపిఐ కార్యాలయం నుంచి నిరసనగా రైతులతో కలిసి నష్ట పరిహారం రైతులకు తక్షణమే అందించాలనే నినాదాలతో ఎమ్మార్వో కార్యాలయం ముట్టడించడం జరిగింది. సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య మాట్లాడుతూ వర్షాలు లేకపోవడంతో జిల్లాలో కరువు విలయతాండవం చేస్తుందని 24 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టకుండా రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని రైతులు ఖరీఫ్ రవి సీజన్లో పంటలు వేయడానికి విత్తనాలు రసాయన ఎరువులు సేద్యపు ఖర్చులకోసం బ్యాంకులో ప్రైవేటు వంటి వ్యాపార అప్పులు చేసి చేతికి పంటలు రాక అప్పుల్లో కూరుకు పోయారని జిల్లాలో ఇప్పటికి 20 మందికి పైగా రైతులు అప్పులు బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నారని ఏ సీజన్లో పంట నష్టపోతే ఆ సీజన్లో నష్టపరిహారం ఇస్తామన్న సీఎం జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి ఇప్పుడు మాట్లాడడం లేదని తక్షణమే రైతుల ఖాతాలలో ఎకరాకు 40000 చొప్పున మిర్చి ఉల్లి వంటి ఉద్యాన రైతులకు లక్ష రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని అన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మార్వో రుద్ర గౌడ్ కు అందజేశారు వినతిపత్రం అందుకున్న మండల ఎమ్మార్వో రుద్ర గౌడ్ తక్షణమే ఈ సమస్యపై ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌలు వతి సంఘం జిల్లా కార్యదర్శి కే తిమ్మయ్య సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి భాస్కర్ మంత్రాలయం సిపిఐ మండల కార్యదర్శి లక్ష్మీనాయక్, మండల సిపిఐ కార్యదర్శి గోపాల్ ఏఐఎస్ఎఫ్ నాయకులు వీరేష్ మరియు రైతులు పాల్గొన్నారు.
కోసిగి : పంట నష్ట పరిహారం రైతుల ఖాతాలకు జమ చేయాలి.. సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య
RELATED ARTICLES