కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని మండల విద్యాధికారిని శోభారాణి ఆధ్వర్యంలో మండలంలోని 49 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఎస్ఎంసి చైర్మన్ లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ 1 మొయినుద్దీన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధానోపాధ్యాయులతో ఎస్ఎంసి చైర్మన్ లతో పాఠశాలల అభివృద్ధి గురించి ఎస్ఎంసి చైర్మన్ లు కృషి చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సహకరించి మన గ్రామాలలోని పాఠశాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన గ్రామాల పాఠశాలలను ప్రైవేట్ రంగ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేసుకునే నిధులు ప్రభుత్వం అందిస్తుందని పాఠశాలల్లో శుభ్రత పాటించి, విద్యార్థులు మంచి పద్ధతులు అలవర్చుకునేలా కృషి చేయాలని, మధ్యాహ్న భోజన పథకంలో ఏటువంటి మార్పులు లేకుండా మెనూ ప్రకారం రుచికరమైన బోజనం అందించాలని, తరగతులు నిర్వహణ విషయంలో పిల్లల చదువు విషయంలోనూ శ్రద్ధ వహించాలని, టాయిలెట్ల పరిశుభ్రత కోసం శానిటరీ సామాగ్రి అందించడం జరుగుతుందని కాబట్టి ఎస్ఎంసి చైర్మన్లు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ప్రధానోపాధ్యాయులతో సహకరించి పాఠశాలలను అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా కోసిగి మండలం ఎంఈఓ శోభ రాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో MEO శోభారాణి తో పాటు మండలంలోని 49 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎస్ఎంసి చైర్మన్లు పాల్గొన్నారు.
కోసిగిలో మండల స్థాయి SMC ట్రైనింగ్
RELATED ARTICLES