TEJA NEWS TV
నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలో గతంలో వైసిపి ప్రభుత్వం లో ఉండి దౌర్జన్యాలకు పాల్పడుతూ కోర్ట్ ఆర్డర్ల ను సైతం లెక్కచేయకుండా నేను చెప్పిందే వినాలి అంటూ దౌర్జన్యాలకు కాలు దువ్వి రౌడీల లాగా వ్యవహరిస్తూ ఉన్న పట్టించుకునే వారే లేరు.కోర్టును ఆశ్రయించగా IA 815/2021 సంవత్సరంలో ఇంజక్షన్ ఆర్డర్ (టిల్ ఫర్ ఆర్డర్)పొంది ఆపై 22769/2024 న హైకోర్టు ఆర్డర్ ను పొందిన రుద్రవరం గ్రామానికి చెందిన కమతం రామచంద్రారెడ్డి తండ్రి తాటి రెడ్డి లను ప్రభుత్వం మారిన పాత వాసన పోలేదన్నట్టు నేటికి వారిపై దౌర్జన్యాలు దాడులు చేస్తున్నారని,వారి పితృర్జితమైన పొలంలో వారిపై చేసిన దాడులను ఫోటోలతో కోర్టును ఆశ్రయించగా వారిపై కోర్టు ధిక్కరణ కింద ప్రైవేట్ కేసు నమోదు చేయడం జరిగింది. అయినా కూడా వారి వ్యవహార శైలి మారలేదు. అదే పొలంలో మరల ఈరోజు బుధవారం జూన్ 2025 తేదీన ట్రాక్టర్ తో టిల్లర్ కొట్టడం జరిగింది. ఈ సందర్భంగా పొలం యజమానుల పై అత్యాయత్నం ప్రయత్నం కూడా చేస్తున్నట్లు సమాచారం ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ అక్రమదారులు కోర్ట్ ఆర్డర్లను లెక్కచేయకుండా గుండా లాగా వ్యవహరిస్తున్నారని కోర్టుకు విలువ లేదా కోర్టు ఆర్డర్ లకు విలువ లేదా అంటూ బాధితులు వాపోతున్నారు.తమ పొలాన్ని అక్రమంగా చదును చేసి పొలాన్ని దున్నుతున్నారని వెంటనే వీరి పై కఠిన చర్యలు తీసుకొని న్యాయాన్ని సంరక్షించాలని అక్రమార్కుల బారి నుండి తమ పొలాన్ని కాపాడాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.


