భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
కొత్తగూడెం, : సింగరేణి కొత్తగూడెం ఏరియాలో కోతుల బెడద రోజురోజుకు పెరుగుతోంది. కార్మిక కుటుంబాలు ముఖ్యంగా పిల్లలు, మహిళలు ఈ కోతుల దాడులకు గురవుతూ తీవ్ర భయాందోళనలో జీవిస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు పూల. రవీందర్ పిలుపుమేరకు స్థానిక నాయకులు మందుల జయరాజు ఆధ్వర్యంలో సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం శాలెం రాజు ని కలిసి మెమొరాండం అందజేశారు.
ఈ సందర్భంగా పూల. రవీందర్ మాట్లాడుతూ, “కార్మికులు డ్యూటీలకు వెళ్లిన తర్వాత వారి కుటుంబ సభ్యులు ఇంట్లో సురక్షితంగా ఉండాలనే భరోసా లేకుండా పోయింది. కోతుల దాడులు పైశాచికంగా ఉండడంతో పిల్లలు, మహిళలు గాయపడుతున్నారు. కార్మికులు వారి పనిపై దృష్టి పెట్టలేకపోతున్నారు. దీని వలన సంస్థకే నష్టం జరుగే అవకాశముంది,” అని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మిక కుటుంబాలకు రక్షణ కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, కోతులను పట్టించి అటవీ ప్రాంతాలకు తరలించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో మందుల జయరాజు, గుత్తుల దుర్గాప్రసాద్, భూక్య రవి, మారేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
కోత్తగూడెం సింగరేణి ఏరియా కార్మిక కుటుంబాలను కోతుల బెడద నుండి రక్షించాలి – మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు పూల. రవీందర్
RELATED ARTICLES



