మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు ను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉంచిన నేపథ్యంలో వారిని వెంటనే విడుదల చేయాలని.. ఈరోజు
ఆలూరు నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, మాజీ MLA కోట్ల సుజాతమ్మ కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా మాన్వి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిర్వహించిన ర్యాలీకి హాజరై సంఘీభావం తెలిపారు. మాన్వి నియోజకవర్గం TDP శ్రేణులు నందమూరి, నారా కుటుంబ అభిమానులు సుజాతమ్మ కు పెద్దఎత్తున పూలమాలలతో ఘనస్వాగతం పలికారు.
ఈకార్యక్రమానికి కర్ణాటక మరియు ఆంద్రప్రదేశ్ ఆలూరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,TDPఅభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
కోట్ల సుజాతమ్మ కు ఘన స్వాగతం పలికిన మాన్వి తాలూకా TDP శ్రేణులు
RELATED ARTICLES