హైదరాబాద్ – జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారంలో ఘటన
6 పేజిల సూసైడ్ నోట్ రాసి ఇద్దరు కొడుకులు అర్షిత్ రెడ్డి, ఆశిష్ రెడ్డిలను కొబ్బరిబొండాల కత్తితో నరికి అనంతరం 5 ఫ్లోర్ల అపార్ట్‌మెంట్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి తేజస్విని
చిన్నకొడుకు ఆశిష్ రెడ్డిని షాపూర్ నగర్లోని రామ్రాజ్ ఆసుపత్రికి తరలించేలోపే మృతి
ముందు నుండి తేజస్విని(32)కి కళ్లసమస్య.. అదే సమస్య ఇద్దరు పిల్లలకు రావడం ప్రతి 4 గంటలకు ఒకసారి కళ్లల్లో డ్రాప్స్ వేస్తే కాని కనబడని సమస్యతో సతమతమవుతూ.. చాల ఏళ్లనుండి ఈ సమస్యతో పోరాడుతు చచ్చి బ్రతుకుతున్న పరిస్థితి
దీంతో ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతున్నాయని.. భర్త కూడా కోపంతో చస్తే చావండి అంటూ గొడవకు దిగుతాడని దీంతోనే పిల్లలను చంపి తాను సూసైడ్ చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న తేజస్విని