భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
18-10-2024
కొత్తగూడెం టౌన్.
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జీవో నెంబర్ 76 పథకాన్ని వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు గొడుగు శ్రీధర్ యాదవ్, కొత్తగూడెం తహసిల్దార్ ఆఫీస్ నందు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
*1) జీవో నెంబర్ 76 పథకాన్ని ఎలక్షన్ల పేరు చెప్పి సంవత్సర కాలం గడుస్తున్న ఈ పథకం ముందుకు తీసుకువెళ్ల లేకపోవడం ప్రజా ప్రతినిధుల వైఫల్యమేనా అని అన్నారు.
*2) ఈ పథకాన్ని 2023 వ సంవత్సరమునందు ఇంటిని నిర్మించుకున్న లబ్ధిదారులకు కూడా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున సూచించడం జరిగింది.
*3) పట్టాలు వచ్చినవారికి బౌండరీలు తప్పులను (సవరణ) చేసుకునే విధంగా జీవోలో మార్పులు తీసుకురావాలని ఎడిట్ ఆప్షన్ ను అమలు చేయాలని అన్నారు.
*4) ఉమ్మడి ఆస్తిని ఒకే వ్యక్తిపై రిజిస్ట్రేషన్ చేయడం వలన ఆ కుటుంబ సభ్యులు అన్నదమ్ములు లేదా అక్కాచెల్లెళ్లు తీవ్రమైన అసౌకర్యానికి గురి అవుతున్నారు. ఒక వ్యక్తిపై ఆస్తి ఉండడం వలన ఆ ఆస్తిని ఆ వ్యక్తి అమ్ముకోవడం జరుగుతా ఉంది తద్వారా మిగతా సభ్యులు నష్టపోవడం జరుగుతుంది. అందువలన పట్టా జారీ చేసే ముందరనే తగినటువంటి విచారణ జరిపి ఉమ్మడి ఆస్తులకు విజ్ఞప్తి చేయడం జరిగింది.
*ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షుడు యశ్వంత్, ఉపాధ్యక్షురాలు అన్నపూర్ణ,స్వామి మరియు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జీవో నెంబర్ 76 పథకాన్ని వెంటనే అమలు చేయాలి – గొడుగు శ్రీధర్ యాదవ్
RELATED ARTICLES