Tuesday, January 14, 2025

కొత్తగూడెం కార్పొరేషన్ వద్దు-పల్లె ప్రాంతాలే ముద్దు అనే నినాదంతో  భారీ నిరసన ర్యాలీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
6-1-2025
        

కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుకు ఆదిలోనే నిరసనలు మొదలయ్యాయి. సుజాతనగర్ మండలంలోని 7 గ్రామపంచాయతీలను కార్పొరేషన్ లో విలీనం చేసే ప్రక్రియను వ్యతిరేకిస్తూ సుజాతనగర్ మండల కేంద్రంలో 7 గ్రామ పంచాయతీల ప్రజలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ యొక్క నిరసన ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించినటువంటి సిపిఎం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య, మాట్లాడుతూ సుజాతనగర్ మండలం ఇంకా గ్రామీణ ప్రాంత వ్యవస్థ గానే ఉందని 6000 మంది వ్యవసాయ కూలీలు ఈ 7 గ్రామపంచాయతీలలో ఉన్నారని రెక్కడితే గానీ డొక్క నిండని వ్యవసాయ కూలీలకు కార్పొరేషన్ వలన వామపక్షాల పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దవుతుందని, దీనివలన 5000 మంది వ్యవసాయ కూలీలు బతుకు భారం అవుతుందని, ఇంటి పన్నులు, పంపు బిల్లులు, పెరుగుతాయని చెత్త పన్ను విధిస్తారని,రైతుల సబ్సిడీలు రద్దు అవుతాయని, వంద రోజుల కూలీల సంఖ్య ఆధారంగా సిమెంట్ రోడ్లు వస్తున్నాయని ఆ యొక్క సిమెంట్ రోడ్లు ఇక రావని, ఒకనాడు నియోజకవర్గ కేంద్రంగా ఉన్న సుజాతనగర్ అస్తిత్వం కోల్పోతుందని సుజాతనగర్ మండలంలో గుండెకాయ నటువంటి 7 గ్రామపంచాయతీలు కార్పొరేషన్ లో కలపడం వలన ఉనికి పోతుందని దీని ద్వారా పేద ప్రజలకు నష్టం జరుగుతుందని, చిరు వ్యాపారులు, ఇతర వ్యాపారస్తుల వ్యాపారాలు దెబ్బతింటాయని, రైతాంగానికి నష్టమని, ఎలాంటి శాస్త్రీయత లేకుండా  సుజాతనగర్ మండలంలోని 7 గ్రామపంచాయతీలలో గ్రామసభలు నిర్వహించకుండా ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ లో ఏడు గ్రామ పంచాయతీలను కలపడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ రద్దు అయ్యే వరకు సుజాతనగర్ మండలంలోని 7గ్రామపంచాయతీ ప్రజలతో పోరాటం కొనసాగిస్తామని అందులో భాగంగానే ఈనెల 20న  కలెక్టరేట్ వద్ద 2వేల మందితో ధర్నా కార్యక్రమం చేపడతామని, ప్రభుత్వం దిగి రాకపోతే ప్రజల సహకారంతో హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిరసన ర్యాలీ అనంతరం MRO  శిరీష , MDO భారతి , కార్పొరేషన్ వద్దు- పల్లె ప్రాంతాలు ముద్దు అనే మెమోరండం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కున్సోత్ ధర్మా , సిపిఎం సుజాతనగర్ మండల కార్యదర్శి వీర్ల రమేష్, బచ్చలకూర శ్రీనివాస్, కొండె కృష్ణ, నల్లగొపు పుల్లయ్య, మద్దెల శ్రీలక్ష్మి, సోలం నాగరత్నమ్మ, భూక్య శంకర్, బానోత్ ఈరు, బాలు వెంకటేశ్వర్లు, గండమాల భాస్కర్, గుగులోతు జగన్, కోలాహలం శ్రీధర్ రాజు, కొంపెల్లి ఐలయ్య , బానోత్ శారద, బత్తుల కళావతి, ఆకునూరి పద్మ, కొప్పుల సత్యవతి, ఆది ఉమారాణి, మద్దెల ప్రసాద్, పాండవుల సత్యనారాయణ, భూక్య హథిరాం, బానోత్ జ్యోతిరమ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular