భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
6-05-2025
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రాంతంలో శుక్రవారం నాడు జర్నలిస్టులకు చెందిన నూతన కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యాలయాన్ని తెలంగాణ ఉద్యమకారుడు ఆకునూరి కనకరాజు మరియు సీనియర్ రిపోర్టర్ రాజేష్ సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ – “మీడియా ఒక సామాజిక Spiegel లాంటిది. ప్రజల సమస్యలపై అన్యాయాలు, అక్రమాలు పైన సమాజా హితం కొరకు వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడం, ప్రజల హక్కుల కోసం నిరంతరం కృషి చేయడం జర్నలిస్టుల బాధ్యత. ప్రభుత్వ వ్యవస్థలకి ప్రజల మధ్య సంబంధాన్ని బలంగా నిలిపేందుకు పాత్రికేయులు పాత్ర పోషించాలి” అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కొత్తగూడెం నుంచి పలువురు సీనియర్ జర్నలిస్టులు, బాబు, అఫ్జల్, నరసింహ, జంపన్న, కుమార్ , మరియు రాజకీయ పార్టీల ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొని తదితరులు కార్యాలయ యాజమాన్యాన్ని అభినందించారు.
