Teja news tv
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ 133 వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ, అంబేద్కర్ ప్రపంచ స్థాయి న్యాయవాది, సంఘ సంస్కర్త, మన దేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి, భారతదేశంలో దళితోద్ధరణ ఉద్యమం వెనుక ఉన్న శక్తిగా ఆయన ఘనత పొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు ఎం ఎస్ ఆర్ రవిచంద్ర, అరకల కరుణాకర్, దూదిపాల రవికుమార్, సందుపట్ల ప్రవీణ్ కుమార్ , నల్లమల ప్రతిభ , సీనియిర్ న్యాయవాదులు రేపాక వెంకటరత్నం, గాజుల రామ్మూర్తి, సూరెడ్డి రమణారెడ్డి కోదుమూరు సత్యనారాయణ పట్టుపల్లి నిరంజన్ రావు, బాగo మాధవరావు, పిసరిమల్లి నాగేశ్వరరావు, దుండ్ర రమేష్ , కట్టుకోజువెల నాగేశ్వరరావు, మల్లెల ఉషారాణి, మెండు రాజమల్లు,శ్రీనివాస్, నరేంద్రబాబు,,ఎర్రపాటి కృష్ణ, ఎన్.గురుమూర్తి, పాతూరి పాండురంగ విటల్, మారపాక రమేష్ , యాసా యుగంధర, నాయుడు,, రమేష్, అంకుష్, హరి తదితరులు పాల్గొన్నారు .
కొత్తగూడెంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
RELATED ARTICLES