భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
6.09.2025
కొత్తగూడెం, సెప్టెంబర్ 6: జర్నలిస్ట్ డే సందర్భంగా కొత్తగూడెం సిపిఐ క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు జర్నలిస్టులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియా ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛ, హక్కులను అందరూ బాధ్యతగా కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, పెద్దఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు.
కొత్తగూడెం:జర్నలిస్టులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
RELATED ARTICLES



