తేజ న్యూస్ టివి ప్రతినిధి,
వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండల కేంద్రంలో శాసనసభ్యులు కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో పార్లమెంట్ సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది . సమావేశంలో పాల్గొన్న డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో దాదాపుగా 15 సీట్లు గెలిచి సోనియా గాంధీ కి కానుకగా ఇస్తామని ఇండియా కూటమి ద్వారా విడుదల చేసిన మేనిఫెస్టోలో పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా మేనిఫెస్టో ఉందని దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఎదురు చూస్తుందని రామకృష్ణ అన్నారు. పాంచ్ న్యాయ్ పచ్చిస్ గ్యారెంటీలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని బిజెపి లాగా అబద్ధాలడి ధనవంతులకే దేశాన్ని కట్టబెట్టడం బిజెపికే సాధ్యమని భారత దేశాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తప్పకుండా రావాల్సి ఉందని దేశ ప్రజలందరూ రాహుల్ గాంధీ ని జూడో యాత్ర ద్వారా గమనించారు ప్రధానిగా రాహుల్ గాంధీ దేశాన్ని కాపాడతారని రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు ఎంపీ పసునూరి దయాకర్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు స్వర్ణ వరంగల్ లోక్సభ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ జిల్లా అధికార ప్రతినిధి శేఖర్ రావు పర్వతగిరి మండల అధ్యక్షులు అనిల్ హనుమకొండ జిల్లా ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ యం వి లాజరెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది: డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
RELATED ARTICLES