TEJA NEWS TV: విద్యార్థులేమో 200 మంది…ఉద్యాయులేమో సున్నా…విద్య కొనసాగేదెలా…ఎస్ఎఫ్ఐ నాగరాజు,విద్యార్థుల తల్లిదండ్రులు…
హోలగుంద*:స్థానిక మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది అంటూ మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు నాగరాజు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ముందు నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ కెజిబివి పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు దాదాపు 200 మంది విద్యార్థినిలు విద్యను అభ్యసిస్తున్నారు. కానీ ఉపాధ్యాయులు మాత్రం ఒక్కరు కూడా లేకపోవడం చాలా బాధాకరమని తెలియజేశారు.విద్యను అభ్యసించడానికి వివిధ గ్రామాల నుండి వచ్చి ఇక్కడ చేరి మంచి విద్యను పొందలనుకున్న విద్యార్థుల ఆశయాలకు నిరుగార్చే విదంగా ఇక్కడ పరిస్థితి ఉంది.ఈ విషయం గురించి ఇప్పటి వరకు అధికారులు ఆలోచించారా లేదా విద్యను గాడికి వదిలేశార అని ప్రశ్నించారు.కావున అధికారులు స్పందించి విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులను కూడా నియమించాలని కోరారు.విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వం పై అధికారులపై తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు.పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకుంటారని ఇక్కడ చేరిస్తే విద్యను బోధించే సిబ్బందే లేకపోతే ఇక విద్యార్థుల చదువులు కొనసాగేది ఎలా అని ప్రశ్నించారు. అధికారులు స్పందించి ఉపాధ్యాయులను నియమించే విదంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినిల తల్లిదండ్రులు ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.
కెజిబివి హాస్టల్లో ఉపాధ్యాయుల కొరత
RELATED ARTICLES