Saturday, January 18, 2025

కులగణన సర్వేలో అధికారులు పూర్తి సమాచారాన్ని సేకరించాలి —రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 
తేజ న్యూస్ టీవీ
6-11-2024
కులగణన సర్వేలో సర్వే అధికారులు కుటుంబ యజమాని నుండి సమగ్రంగా పూర్తి సమాచారాన్ని సేకరించాలని *DCMS చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు* అన్నారు.

నేటి నుండి నిర్వహించే సమగ్ర సర్వేలో భాగంగా *బుధవారం 1 వార్డు పాత పాల్వంచ గడియకట్టలో* చేపట్టిన సర్వేలో *కొత్వాల* పాల్గొన్నారు.

ఈ సందర్భంగా *కొత్వాల* మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేకు అధికారులకు ప్రజలు సహకరించాలని అన్నారు. సర్వేకు వచ్చిన అధికారులకు కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో పారదర్శకమైన సమాచారాన్ని అందించాలని *కొత్వాల* కోరారు.

ఈ కార్యక్రమంలో *సర్వే టీం పాత పాల్వంచ సూపర్ వైజర్ రవి ప్రసాద్, RP లు యాటా అరుణ, P పుష్పలత, అంగన్వాడీ టీచర్ నాగమణి, SHG సభ్యులు మృదుల, నిహారిక*, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular