కుక్కల దాడిలో 15పొట్టేళ్ల మృతి.. భోరుమంటున్న పాడి రైతులు. ₹2లక్షల నష్టం
వరదయ్యపాలెం మండలం సీఏల్ ఎన్ పల్లిలో కుక్కలు దాడి చేసిన ఘటనలో 15 పొట్టళ్ళ్ళు మృతి చెందాయి.
వరదయ్యపాలెం సెప్టెంబర్ 23
సీఏల్ఎన్ పల్లి చావాలి ఎస్సీ కాలనీకి చెందిన వెంపల్ల రామకృష్ణయ్య, వెంపల్ల లక్ష్మయ్య వెంపల్ల వేమయ్య అనే పాడి రైతులు పొట్టేళ్ల పెంపకం ద్వారా జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.ఆదివారం గ్రామ సమీపంలో అరిక సేలు వద్ద క్వారీల సమీపంలో మేత మేస్తుండగా కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 15పొట్టేళ్ళు మృతి చెందగా మరో ఏడు గాయపడ్డాయి.సాయంత్రం బాధిత పాడి రైతులు.అక్కడకు వెళ్లి చూడగా మృతి చెందిన పొట్టేళ్ళు చూసి లబోదిబో మన్నారు సుమారు ₹2లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాదితులు ఆవేదన వ్యక్తంచేశారు.
కుక్కల దాడిలో 15పొట్టేళ్ల మృతి.. భోరుమంటున్న పాడి రైతులు. ₹2లక్షల నష్టం
RELATED ARTICLES