Saturday, January 18, 2025

కుందుర్పిలో నిర్లక్ష్యపు నీడలో ప్రాచీన ఆలయాలు

-కుందుర్పిలో నిర్లక్ష్యపు నీడలో ప్రాచీన ఆలయాలు.

-భారతీయ సంస్కృతిని పరిరక్షణలో ప్రభుత్వాలు విఫలం.
-ప్రతిష్టకు నోచుకున్న మూడు లింగాల..
-ప్రతిష్టకు నోచుకుని మరో రెండు లింగాలు.
-మహాదేవశ్వర దేవా, సూర్య దేవా లింగాలు.
-ఆధరణకు నోచుకుని ఐదు లింగాల ఆలయం.
-11 శతాబ్దంలో చోళరాజ్యంలో ఆలయం నిర్మితం……
-మల్లయ్య దేవ చోళ్ళ మహారాజు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కోసం ఈ ఆలయం నిర్మితం..

కళ్యాణదుర్గం,కందుర్పి, తేజ టీవీ న్యూస్): అందరికీ మండలంలో పలు గ్రామాలలో పిలిచిన అతి ప్రాచీన దేవాలయాలు నిర్లక్ష్య నీడలో మగ్గుతున్నాయి.
భారతీయ సంస్కృతిని చాటి చెప్పే కళాఖండాలకు , అద్భుతమైన కళా సంపదను కనుమరుగు కాకుండా, తగిన ప్రాధాన్యత గుర్తింపునిచ్చి కాపాడడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. మండల పరిధిలోని మలైనూరు, కుందుర్పి, గ్రామంలో పలు అతి ప్రాచీన పంచలింగేశ్వర ఆలయం నిర్లక్ష్యపు నీడలో మగ్గుతుంది.ఆ ఆలయాలు నిర్వహణ అస్తమస్తమైంది. చారిత్రక ఆధారాలు కాలక్రమేణ కాలగర్భంలో కలిసిపోతున్నాయి. శిల్పకళ ప్రభావాన్ని ప్రతిబింబించే ఆలయాలకు నేడు ఆదరణ కరువయ్యాయని, శిధిల వ్యవస్థకు చేరుకుంటున్నాయి. ఏపీ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందుర్పి మండల పరిధిలోని మలయనురు గ్రామ శివారున శీధిల వ్యవస్థలో వున్న ఐదు లింగాల ఆలయం ఈ కోవకు చెందినదే. జిల్లా ఫెర్స్ అండ్ ఫెస్టివల్స్ గ్రంథంలో చెప్పిన ప్రకారం ఆలయం వివరాలు ఇలా. 11వ శతాబ్దంలో చోళ రాజుల రాజ్యంలో మల్లయ్య అనే నాయకుడు గ్రామాన్ని నిర్మించారు. అందుకే ఆ గ్రామాన్ని మల్లయ్య ఊరుగా పిలిచేవారు ఆనాడు. నేడు కాలక్రమేనా అది మలయ నూరు గా మారేలా రూపాంతరం చెందినది. ఇక్కడ క్రీ.శ 1179లో ఐదులింగాల దేవాలయాన్ని అసంపూర్తిగా నిర్మించారని తెలుస్తుంది. అయితే దీనికొక విశిష్టత వుంది. ఒకే రోజులోగా ఐదు లింగాల ప్రతిష్టాపనకు పూనుకోగా. మూడు లింగాలు ప్రతిష్టాపన పూర్తి అయినది. తద్వారా నాలుగో లింగం ప్రతిష్టించే సమయానికి తెల్లవారడంతో నక్షత్ర బలం సరిగా లేదని భావనతో నాలుగో లింగాన్ని మహాదేవేశ్వర దేవా ప్రతిష్టించలేదని బొమ్మ దేవర గుడి కట్ట వంశా వళలా తామ్ర శాసనంలో పేర్కొన్నారు. కానీ ఐదో లింగం సూర్య దేవా ఆలయమే ఆచరణకు నోచుకోలేదు. మల్లికార్జున దేవా , లక్ష్మిశ్వర దేవా, ఇరుంగోలేశ్వర దేవా, మహాదేశ్వర దేవా, సూర్యదేవా, అను ఐదు నామాలతో ప్రతిష్టించాలని వారు సంకల్పించినట్టు శిలా శాసనాలు ద్వారా చరిత్ర తెలుస్తుంది. హేమవతి రాజధానిగా చాళుక్య చక్రవర్తి, మూడవ తైల దేవుడు, మహాసామంత మండల దీసుడైన త్రిభువన మల్లయ్య దేవచోళ్ళ మహారాజు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కోసం ఐదు లింగాల ఆలయంలంను నిర్మించినట్టు తెలుస్తుంది. పంచలింగాల ప్రతిష్టాపన నిర్మాణ వ్యయానికి గ్రామంలో భూమి సిస్తులు, వాహనాలపై పన్ను ,అమ్మకం పన్ళులు విధించి రోజు మల్లయ్య దేవ నిర్మాణ కార్యక్రమాలకు పూనుకున్నట్టు ఎస్ఐఐ 253 శాసన అంశాల వల్ల తెలుస్తుంది. కాగా మల్లికార్జున దేవా ,లక్ష్మీశ్వర దేవా, ఇరుంగోళేశవర దేవా, పేరున లింగాలు మాత్రమే ప్రతిష్టకు నోచుకున్నాయి. మిగిలిన రెండు లింగాలు ప్రతిష్టాపనకు నోచుకోకపోవడంతో అప్పుడే ఆలయాలకు ఆదరణ కరువైందని తెలుస్తుంది. లక్ష్మేశ్వర దేవాలయం నిర్మాణానికి ప్రత్యేకంగా ఒక మహానాయుడును మలయనూరులో నిర్వహించారని ఆ మహానాడుకు నానా దేశపు వర్తకులు హాజరయ్యారని, వారి లాభాల్లో కొంత భాగం ఆలయ ఖర్చులకు ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని ఇక్కడ శాసనాల వల్ల తెలుస్తుంది. ఇంత ఘన చరిత్ర కలిగిన ఐదు లింగాల ఆలయం అసంపూర్తిగా నిలిచినా నేడు ఆదరణకు కరువైంది. ఈ ఘన చరిత్ర కలిగిన ఐదు లింగాల ఆలయంకు మానవత్వం కలిగిన స్వచ్ఛంద సేవా సంస్థల దాతలు, ఎంపీ ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధులు కానీ ఆలయ అభివృద్ధికి ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు అతి ఘన చరిత్ర కలిగిన అతి ప్రాచీన ఆలయాలకు అభివృద్ధికి నోచుకోనెల , భారతీయ సంస్కృతి సంపదను కాపాడేలా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ వార్తను సీనియర్ జర్నలిస్ట్ బి, కోదండరాములు పరిశోదాత్మకంగా వార్తను మలచడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular