Sunday, January 18, 2026

**కీసర గ్రామంలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి గాయాలు**

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామంలో విద్యుత్ షాక్ ఘటన చోటుచేసుకుంది. నందిగామ నుంచి కంచికచర్లకు వెళ్తున్న 33 కె.వి విద్యుత్ లైన్ ప్రమాదవశాత్తు నాగరత్నం ఇంటి వద్ద చెక్క సెంట్రింగ్ పనుల సమయంలో ఇంటి పైభాగానికి తగలడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మధిర మండలం మాటూరు గ్రామానికి చెందినవారు. ఘటన అనంతరం స్థానికులు అప్రమత్తమై వెంటనే కీసర టోల్ ప్లాజా అంబులెన్స్ సాయంతో ఆయనను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం మధుర ఐ కేర్ ఆసుపత్రికి తరలించారు.

గ్రామస్థులు విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ తరహా ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular